స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్ - 6 లోకి అడుగుపెట్టింది. సోమవారం నాటి ఎపిసోడ్ లో.. కావ్య ముగ్గు వెయ్యడంతో చాలా బాగా వేసింది అంటూ అందరూ మెచ్చుకుంటారు. రాజ్ మాత్రం ముగ్గు వేసి అందరిని ముగ్గులోకి దింపుతుందని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి అనుకోకుండా రాజ్ సూట్ కి కావ్య పెయింట్ అంటిస్తుంది. దాంతో రాజ్ చిరాకు పడుతూ కావ్య మీద అరుస్తాడు. అయితే అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం సూట్ కొత్త డిజైన్ బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తారు. అలా రాజ్ కూల్ అవుతాడు.
ఆ తర్వాత కావ్య నీరసంగా ఇంటికి వెళ్తుంది. కావ్యను అలా చూసిన వాళ్ళ నాన్న... "ఏమైందమ్మా.. అలా ఉన్నావ్?" అని అడుగుతాడు. "ఏం లేదు నాన్న డబ్బుకి- కళకి మధ్య వాగ్వాదం.. ఒకరిది గర్వం.. మరొకరిది ఆత్మ విశ్వాసం. ఆత్మ విశ్వాసం కాపాడుకోవడంలో అలసిపోయాను" అని కావ్య అంటుంది. ఎంట్రీ పాస్ లు వచ్చిన ఆనందంలో కనకం, స్వప్న రిచ్ గా "ఎలా రెడీ అయ్యి వెళ్ళాలి" అని అనుకుంటారు. ఆ తర్వాత కావ్య చీరని కట్టుకుంటుంది స్వప్న. వీళ్ళ హడావిడిని చూసి కావ్య చెల్లి అన్ని సెటైర్ లు వేస్తుంది.
దుగ్గిరాల వారసులైన రాజ్, కళ్యాణ్, రాహుల్ ముగ్గురు కలసి సరదాగా మాట్లాడుకుంటారు. "నువ్వు అన్నింటిలో పర్ఫెక్షన్ ఎందుకు కావాలనుకుంటావు" అని రాహుల్ అడుగుతాడు. "చిన్నప్పటి నుండి తాతయ్యని చూస్తూ పెరిగాను.. అన్నీ అయన నుండి నేర్చుకున్నవే " అని రాజ్ సమాధానమిస్తాడు. "ఇప్పుడు ఇలా హ్యాపీగా ఉన్నాం.. మన లైఫ్ లో కి కూడా వైఫ్ లు వస్తే ఇలా ఉండమెమో" అని రాహుల్ అంటాడు. "మన లైఫ్ లోకి ఎవరు వచ్చినా కూడా మనం ముగ్గురం ఇలాగే కలిసి ఉంటాం" అని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటాడు రాజ్.
కనకం తన ఇద్దరి కూతుళ్లను రిచ్ గా రెడీ చేసి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.